మద్దులపల్లిలో చలివేంద్రం ప్రారంభం
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గ్రామ సర్పంచి ఎల్పుల సరిత చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులకు, ప్రయాణికులకు నీటిని అందజేశారు.
వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచి తెలిపారు. వివిధ గ్రామాలకు వెళ్లే వారికి నీటి ఎద్దడి సమస్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్వాతి, ఉపాధ్యాయులు సదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
