మద్దులపల్లిలో చలివేంద్రం ప్రారంభం

మద్దులపల్లిలో చలివేంద్రం ప్రారంభం

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గ్రామ సర్పంచి ఎల్పుల సరిత చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులకు, ప్రయాణికులకు నీటిని అందజేశారు.
వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచి తెలిపారు. వివిధ గ్రామాలకు వెళ్లే వారికి నీటి ఎద్దడి సమస్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్వాతి, ఉపాధ్యాయులు సదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బస్టాండ్ కూడలిలో చలివేంద్రం ప్రారంభం…

బస్టాండ్ కూడలిలో చలివేంద్రం ప్రారంభం

పరకాల,నేటిధాత్రి

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 9వవార్డులో బస్టాండ్ సర్కిల్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.ప్రయాణికులు, కార్మికులు,సాధారణ ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతంలో అధిక రద్దీ ఉండటంతో ఇలాంటి సౌకర్యాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ అంజయ్య మాట్లాడుతూ పట్టణంలో మరిన్ని ప్రదేశాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ యోచిస్తున్నట్లు తెలిపారు.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుద్ధమైన తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండి శ్రీధర్,కొయ్యడ శ్రీనివాస్,కుక్కల విజయ్, ఆకుల లావణ్య శ్రీధర్,సుధమల రమేష్, వెంకట్ రెడ్డి,జవన్ కిషోర్ స్థానిక ప్రజలు హాజరై మున్సిపాలిటీ చర్యను అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version