తుడుం దెబ్బ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధి కోరింది

క్రీడా పాఠశాలలో వసతులు కరువు

ఆగ్రహం వ్యక్తం చేసిన తుడుం దెబ్బ నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలo లో ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ను ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” నాయకులు సందర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు…అనంతరం మాట్లాడుతూ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు మొత్తం 240 మంది విద్యార్థులు ఈ స్కూల్ లో చదువుతున్నారు.స్పోర్ట్స్ స్కూల్ అంటే ముక్యంగా ఉండవలసింది మంచి రన్నింగ్ ట్రాక్, గ్రౌండ్ ఇక్కడ ఉన్న ట్రాక్ ఆధ్వనంగా ఉండడమే కాకుండా ట్రాక్ మొత్తం రావుతులు బయటికి వచ్చి గుంతలు పడి, ట్రాక్ పక్కన ఉన్న కాలువ నీళ్లు ట్రాక్ పై వచ్చి బురద అవుతుంది. గడ్డి మొలిసి ఇబ్బంది కరంగా ఉంది.
విద్యార్థులకు సరైన టాయిలెట్స్,ఫాన్స్, కరెంట్ సమస్యలతో స్నానం చేయడానికి నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు పెరిగి ఆధ్వనంగా ఉన్నపటికీ గ్రౌండ్ లో ఉన్న స్టేజ్ దిమ్మలు పగిలి రాడ్స్ మొత్తం కూడా విరిగి కింద పడ్డాయి.
ఇంత ఆధ్వనంగా ఉన్న కూడా అధికారులు పట్టించుకోకుండo లేదు అని తీవ్రంగా మండిపడ్డారు.
ఏజెన్సీ గ్రామీణ క్రీడలు అయిన అర్చరి, వాలీ బాల్, ఖో-ఖో గేమ్స్ ని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో ఏర్పాటు చేసి కోచ్ లను నియమించాలని డిమాండ్ చేశారు.
డీడీ, ఐ టిడిపివో జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రివర్యులు గార్లు స్పందించి కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ బాయ్స్ నందు సింతటిక్ ట్రాక్&గ్రౌండ్ చుట్టూ పెన్సింగ్,నూతన స్టేజ్ ఏర్పాటు చేయాలనీ ఇప్పుడు ఉన్న టాయిలెట్స్ ని రిపేర్ చేసి మరికొన్ని టాయిలెట్స్ ని ఏర్పాటు చేయాలి వసతి గృహంలో నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం అదనంగా 2 బోర్లు ఏర్పాటు చేసి ఫాన్స్ & కరెంటు సమస్యలు వేంటేనే పరిష్కరించి విద్యార్థుల బంగారు భవిషత్తు కు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ని అభివృద్ధి చేసి ట్రైబల్ స్టేట్ మీట్ గేమ్స్ జరిగేలా అధికారులు దృష్టి పెట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమం లో “తుడుం దెబ్బ” నాయకులు పూనేం సందీప్ కుంజ నర్సింగ రావు ఈసం వెంకన్న ఇర్ప రవి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version