ఘనంగా హిందూ సమ్మేళనం

ఘనంగా హిందూ సమ్మేళనం

హిందూ ఐక్యతతో భారతదేశాన్ని విశ్వగురు స్థాయికి తీసుకెళ్దాం

ఆర్ఎస్ఎస్ పంచ పరివర్తన లక్ష్యాన్ని సాధిద్దాం

జైపూర్ నేటి ధాత్రి:

 

 

 

శెట్టిపల్లి రామాలయాన్ని కేంద్రంగా తీసుకొని రామరావుపేట, ఇందారం,టేకుమట్ల,ఎల్కంటి, శెట్టిపల్లి,బెజ్జాల,నర్సింగాపూర్,మద్దులపల్లి,కుందారం గ్రామాల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది హిందువులు పాల్గొని తమ ఐక్యతను చాటారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామదాసు శ్రేయాంశు మహరాజ్ హాజరయ్యారు.ప్రధాన వక్త ప్రభుకుమార్ జీ హిందువులకు సందేశం ఇస్తూ,భవిష్యత్తులో మన ఐక్యత వల్ల భారతదేశం విశ్వగురు స్థానంలో నిలబడాలని పేర్కొన్నారు.అలాగే ఆర్‌ఎస్సెస్ పంచ పరివర్తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version