దిడిగి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.
◆-: గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమతి జగదాంబ సోమప్ప
జహీరాబాద్ నేటి ధాత్రి:
గ్రామానికి టర్నింగ్ అయ్యే రెండు ప్రధాన పాయింట్ల వద్ద రోడ్డు పక్కల పొదలను జెసిబి సహాయంతో పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన దారి కనిపిస్తూ ప్రమాదాల అవకాశాలు తగ్గాయి. అంతేకాకుండా గ్రామానికి గుర్తింపుగా గ్రామ ఊరు పేరు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో, ఉపసర్పంచ్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సౌందర్యం పెరగడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చేపట్టిన ఈ చర్యలపై గ్రామస్తులు సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల సర్పంచ్ జగదాంబ సోమప్ప చూపుతున్న చొరవకు ఇది నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గ్రామ సర్పంచ్ తెలిపారు.
