ప్రధాని మోదీ, పుతిన్‏ల మధ్య అరుదైన మొక్క.. ప్రత్యేకతలు ఇవే.

ప్రధాని మోదీ, పుతిన్‏ల మధ్య అరుదైన మొక్క.. ప్రత్యేకతలు ఇవే!

 

శుక్రవారం పుతిన్‌ , ప్రధాని మోదీ మధ్య హైదరాబాద్‌ భవన్‌లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జాతీయం,  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అలానే శుక్రవారం పుతిన్‌ (Vladimir Putin), ప్రధాని మోదీ (PM Narendra Modi) మధ్య హైదరాబాద్‌ భవన్‌లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, పసుపు రంగులతో ఎంతో స్పెషల్ గా ఉన్న ఈ మొక్క అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ మొక్క పేరు ఏమిటి, దాని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌ను తెగ వెతికేస్తున్నారు.
హెలికోనియా ప్రత్యేకతలు ఇవే:

ఇరు దేశాధినేతల మధ్యలో ఆకర్షణీయంగా కనిపించిన ఆ మొక్క పేరు హెలికోనియా (Heliconia). సానుకూల శక్తికి ప్రతీకగా దీన్ని భావిస్తుంటారు. వృద్ధి, శ్రేయస్సు, సమతుల్యత, సామరస్యాలతో పాటు కొత్త ఆరంభాలు, ముందడుగులకు శుభ పరిణామంగా ఈ మొక్కను భావిస్తారు. అలానే ఇరుదేశాల మధ్య సంబంధాలు , మెరుగుపడటానికి అలాగే అభివృద్ధి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్క గురించి నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాదు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. హెలికోనియా మొక్క ప్రకృతిలోనే ఒక ప్రత్యేక ఆకర్షణ.దీని పువ్వులు రంగురంగులుగా, కళ్లకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే ప్రత్యేక సమావేశాలు, చర్చలు, డిప్లోమాటిక్ ఈవెంట్స్‌లో దీనిని అలంకరణగా ఉపయోగించడం ఒక సాంప్రదాయంగా కూడా మారింది. అలానే అత్యున్నతస్థాయి దౌత్య సమావేశాల కోసం సిద్ధం చేసే గదుల్లో ఏ వస్తువైనా సరే యాదృచ్ఛికంగా ఉంచరు. పూలు, రంగులు, బ్యాక్‌గ్రౌండ్‌ వంటివి పక్కాగా ఉండేలా చూసుకుంటారు. అందువల్ల, భారత్‌, రష్యా మధ్య స్నేహ బంధానికి, ద్వైపాక్షిక సహకార పురోగతికి ప్రతీకగా హెలికోనియా మొక్కను కావాలనే ఏర్పాటుచేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.

 రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. భారత్‌కు ఐరోపా నుంచి వినతుల వెల్లువ..

 రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. భారత్‌కు ఐరోపా నుంచి వినతుల వెల్లువ

 

పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్‌కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తరువాత పుతిన్‌కు ఇది తొలి భారత పర్యటన. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఏళ్లతరబడి కొనసాగుతుండటం ఐరోపా దేశాల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనను పురస్కరించుకుని ఐరోపా దేశాలు భారత్ సాయం కోసం తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (Putin India Tour).
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాళ్లల్లో ఐరోపా దేశాలు భారత్‌పై అనేక ఒత్తిళ్లు తెచ్చాయి. రష్యా తీరును ఖండించాలని డిమాండ్ చేశాయి. రష్యాతో భారత్ తన బంధాన్ని తెంచుకోవాలని కూడా ఆశించాయి. ఏదో పక్షానికి మద్దతుగా ఉండాలని వివిధ దేశాల ప్రతినిధులు భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, పుతిన్ ఎంతకీ లొంగకపోవడంతో ఐరోపా దేశాలు రూటు మార్చుకున్నాయి. భారత్ జోక్యంతో సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అయితే, భారత్ మాత్రం తటస్థ వైఖరినే కొనసాగించింది. యుద్ధాలు చేసే కాలం ముగిసిందని ప్రధాని మోదీ గతంలో పలుమార్లు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ ఇదే విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.

భారత్, రష్యాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరి పాతికేళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో పుతిన్ తాజాగా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక 2010లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా గుర్తించడంతో దౌత్య బంధం మరింత బలోపేతమైంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version