మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్థిక చేయూత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
నర్సంపేట, నేటిధాత్రి:
మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్థిక చేయూతగా తోడ్పడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నర్సంపేట డిపోలో మంగళవారం మహాలక్ష్మి సంబురాలు ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రెగ్యులర్గా బస్సుల్లో ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులను శాలువాలు, బహుమతులతో సన్మానించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నర్సంపేట డిపో పరిధిలో 2 కోట్లు 49 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సుమారు రూ.106 కోట్లు ఆదా చేసుకున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గణేష్, ఆర్డీవో ఉమారాణి, మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మహిళా సమాఖ్య సభ్యులు, డిపో అధికారులు, డిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
