విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి…

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో రాజీవ్ నగర్ లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు,సంక్షేమ వసతి గృహాలలో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు.వంటశాల,సామాగ్రి నిల్వ గదిని పరిశీలించి ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని సూచించారు.ఇంటర్మీడియట్ ఫలితాలలో అనుత్తీర్ణులైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.ఆదర్శ పాఠశాలల వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అనంతరం కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి,క్రిటికల్ కేర్ విభాగాల నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రజలకు మరింత వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 129.25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అధికారులు గుత్తేదారుల సమన్వయంతో పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం…

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

నూతన భవననిర్మాణానికి శంకుస్థాపన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండల కేంద్రంలో ఆదివారం నాడు రాష్ట్ర రెవిన్యూ గృహానిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ అంకిత్ ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సుమారు 10 కోట్ల 70 లక్షల రూపాయల స్టేట్ గవర్నమెంట్ ఫండ్ టీజీఎంసీడీసీ నిధులతో ఈ అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు
శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులను సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడుతూ వారికి ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ చర్ల మండలంలోని మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు వైద్యులు సిబ్బంది చేస్తున్న కృషి గర్వించదగ్గదని భవిష్యత్తులో ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన చికిత్స అందించాలని మంత్రి ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని తెలిపారు భవన నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని ఆయన అన్నారు
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ నూతన భవనం అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు మరియు ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ రవి బాబు స్థానిక సర్పంచ్ పూజారి సామ్రాజ్యం అన్ని శాఖల జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version