ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యా ప్రదాత కాటిపెల్లి నారాయణ రెడ్డి..

ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యా ప్రదాత కాటిపెల్లి నారాయణ రెడ్డి కి అంతర్జాతీయ యోగా శిక్షణకులు మాధవరెడ్డి కి ఘన సన్మానం భగవద్గీత ల ప్రదానం…

ప్రపంచానికి యోగా, జ్ఞానాన్ని అందించింది. మన భారతదేశమే…

రాయికల్ , జూలై 31, నేటి ధాత్రి:

రాయికల్.మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటిక్యాలలో సుమారుగా 5 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఒక రూం నిర్మించి గ్రంథాలయం ఏర్పాటు చేసి, నిత్యం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఇదే గ్రామానికి చెంది హైదరాబాద్ స్థిరపడిన కాటిపెల్లి నారాయణ రెడ్డి ని, అంతర్జాతీయ యోగా శిక్షణకులు మాధవరెడ్డి లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, మాజీ ఎంపిపి కాటిపెల్లి గంగారెడ్డి, తపస్ జిల్లా బాధ్యులు చెరుకు మహేశ్వర శర్మ, ఉపాధ్యాయ బృందంలు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో లు బహూకరించారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ భగవద్గీత లను ప్రదానం చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ అధ్యక్షతన జరిగిన యోగాతో సంపూర్ణ ఆరోగ్యంపై జరిగిన సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్ముందు పాఠశాలకు ఎటువంటి సహాయమైన చేస్తానని, విద్యతోనే జ్ఞానం లభిస్తుందని అందరు బాగా చదివి ఉన్నత శిఖరాలలు అధిరోహించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా శిక్షకులు శనివారపు మాధవరెడ్డి విద్యార్థులకు యోగా, ధ్యానం నిత్య జీవితంలో వీటి ఆవశ్యకతలపై అవగాహన కల్పించి, ఆసనాలు, యోగా, ధ్యానం నేర్పించారు. ప్రపంచానికి యోగా, ధ్యానం జ్ఞానం అందించినది మన భారత దేశమేనని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని‌ ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో జీయావుద్దీన్, ముజాహిద్, స్వర్ణలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందజేత.!

ఆర్థిక సాయం అందజేత

నిజాంపేట, నేటి దాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మహమ్మద్ హిమాం మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో నగేష్ యాదవ్ ,దుర్గయ్య శీను, లింగం ,సిద్ధరాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version