పాతూరి సాధనకు పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా ప్రదానం
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన పాతూరి సాధనకు జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 56, 57, 58వ బ్యాచ్‌ల కంబైన్డ్ కాన్వకేషన్ కార్యక్రమం సోమవారం రాజేంద్రనగర్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతులమీదుగా సాధన పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. ఇదే విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీతో పాటు పీహెచ్‌డీ వరకు పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.
సాధన తల్లిదండ్రులు పాతూరి నరసింహారావు, శారద తమ కుమార్తె సాధించిన ఈ ఘన విజయాన్ని తమ జీవిత కష్టాలకు లభించిన ఫలితంగా పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, సాధన భర్త మధుర గీత్, మామగారు రావెళ్ల రామారావు (వరంగల్ స్పెషల్ బ్రాంచ్ సబ్‌ఇన్‌స్పెక్టర్), అత్తయ్య సుగుణ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ సాధన భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి ఉన్నత విద్యలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు.
