వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్

నడికూడ,నేటిధాత్రి:

పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండ‌లం వెంకటేశ్వర్లపల్లె గ్రామంలో పిఎసిఎస్,ఐకెపి ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలపరచడం, మహిళలను సాధికారత వైపు నడిపించడం లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన పథకాలలో భాగంగా ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.గత కొన్నేళ్లలో లేనివిధంగా మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మంచి ధరలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,ఏఓ పోరిక జైసింగ్, సొసైటీ ఇన్‌చార్జ్ జ్యోతి, ఏఈఓలు రామకృష్ణ,ప్రదీప్, కాంగ్రెస్ సమన్వయ సమితి సభ్యులు పర్నం మల్లారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎరుకల అంజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ద బోయిన రవీందర్ యాదవ్,సీసీ హేమలత, చైతన్య గ్రామైక్య మహిళా సంగం వివో స్వప్న, సభ్యులు హరిత, సంధ్య, ఓబీలు అనిత, వివో ఏ. సుమలత, ఏపిఎం నాగేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version