సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
విప్లవ కార్మిక సంఘాల డిమాండ్
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.సంస్థలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాలను తక్షణమే నిలిపివేయాలని వారు కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ద్వారా పాత 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని విమర్శించారు.ఈ కోడ్లు కార్మికులకు అనుకూలంగా లేవని, ఇప్పటికే కేరళ,పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు వీటిని తిరస్కరించాయని పేర్కొన్నారు.అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కార్మికుల ప్రధాన డిమాండ్స్ సొంతింటి పథకం, మారుపేరుల మార్పిడి వంటి సమస్యలు పరిష్కరించాలని
కొత్త గనుల ఏర్పాటు,మెడికల్ బోర్డు నిర్వహణ చేపట్టాలి
కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.కొల్ ఇండియా లిమిటెడ్ విధానంలో వేతనాలు చెల్లించాలి
రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపు, హెల్త్ కార్డుల పరిమితి పెంచాలి
11వ వేతన ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి
పదవీ విరమణ రోజునే అన్ని బెనిఫిట్స్ చెల్లించాలి
అదేవిధంగా,సింగరేణిలో సెక్యూరిటీ గార్డుల తొలగింపును తీవ్రంగా ఖండిస్తూ,వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు,సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
ఎం. పోచమల్లు (ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి),
అంబాల మహేందర్ (ఎస్ జి కె ఎస్ రాష్ట్ర నాయకులు)
గోగర్ల శంకర్,(టియుసిఐ) రాష్ట్ర నాయకులు)
తదితరులు పాల్గొన్నారు.
