ధమ్మచక్ర పరివర్తన దినం
-బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్వ భారత దేశ పూర్వ మత మైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి శుభదినం ఈరోజు ఆయన నాగపూర్ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరించినటువంటి శుభదినా రోజునా పర్లపెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పుష్పాలంకరణ కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్న భాస్కర్ , బీసీ సంఘం నాయకులు ఆకుతోట రమేష్, పొన్నం రమేష్, నియోజకవర్గ అధ్యక్షులు పుల్యాల భగత్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యకమం లో మనోజ్ మాట్లాడుతూ…ధమ్మచక్ర పరివర్తన దినం అంటే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ , ఆయన అనుచరులు హిందూ మతం నుండి బౌద్ధమతాన్ని స్వీకరించిన రోజును సూచిస్తుంది. ఈ సంఘటన 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో జరిగింది, అప్పటి నుండి ఈ రోజును బౌద్ధ పండుగగా జరుపుకుంటారు.