మంత్రి బండి సంజయ్‌ని కలిసిన కౌన్సిలర్ విజయ్
పరకాల,నేటిధాత్రి
పట్టణ మున్సిపాలిటీకి చెందిన 15వ వార్డ్ కౌన్సిలర్‌గా ఇటీవల విజయం సాధించిన కుక్కల విజయ్ శనివారం కరీంనగర్లో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.కౌన్సిలర్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుక్కల విజయ్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ కుక్కల విజయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిలర్‌గా నాకు ప్రజలు ఇచ్చిన మద్దతు మరింత బాధ్యతను పెంచిందని నా విజయాన్ని అభినందించి శాలువాతో సత్కరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.పట్టణ అభివృద్ధి కోసం,ముఖ్యంగా నా వార్డ్‌లోని ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తాను.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పారదర్శకంగా సేవలందిస్తానని తెలిపారు.
