22 ఏళ్ల యువతి తప్పిపోయింది
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం గుంట గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్యాలారం సవిత అనే యువతి తప్పిపోయింది. ఆమె ఆచూకీ తెలిసినవారు జహీరాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కాశీనాథ్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరారు. యువతి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.