మేడారం జాతర కోసం బస్సు పాయింట్ ఏర్పాటు.

మేడారం జాతర కోసం బస్సు పాయింట్ ఏర్పాటు.

జాతర అనంతరం బస్టాండ్ ప్రారంభిస్తాం ఆర్టీసీ డిఎం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్ర గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ లను శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన పరకాల బస్ డిపో మేనేజర్ రామ్ ప్రసాద్
ఈ సందర్బంగా మేడారం జాతర కు చిట్యాల్ ప్యాక్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయబోయే బస్ పాయింట్ కి కావాల్సిన సదుపాయాన్ని కల్పించాలని వారు కోరడం జరిగింది దానికి స్పందించిన సర్పంచ్ హామీ ఇవ్వడం జరిగింది
అనంతరం సర్పంచ్ ఆదేశాల మేరకు ఈ యొక్క చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ ప్రారంభించాలని కోరగా వెంటనే స్పందించిన డిఎం బస్టాండు ఆవరణలో పరిశీలించి మేడారం జాతర తర్వాత ఈ నూతన బస్టాండు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు తౌటం నవీన్ ,ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ ,గౌడ్ గ్రామ కార్యదర్శి రవికుమార్ ,బస్సు కండక్టర్ డ్రైవర్లు నందకుమార్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version