పంచాయతీ ఎన్నికలలో పద్మశాలి బీసీ బిడ్డల గెలుపుకు కృషి
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్స్ గా, సర్పంచులు గా పోటీ చేస్తున్న పద్మశాలి బీసీ బిడ్డలని భారీ మెజార్టీతో గెలిపించాలని పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజ్జల వెంకటయ్య కోరారు.అదేవిధంగా రాష్ట్రం లోని పద్మశాలి బీసీ వర్గాలు కృషి చేసి అత్యధిక స్థానాలు గెలిపించి మన బీసీల సత్తా రాష్ట్ర వ్యాప్తంగా చాటాలని తెలిపారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ,వివిధ బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకుడు,తెలంగాణ ఉద్యమకారుడు,పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధిపత్య కులాలకు అడ్డుకట్ట వేయాలంటే బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలే పునాది రాళ్లుగా భావించి మన ఐక్యత మన ఆత్మ గౌరవం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల్లో మన ఓటు మన పద్మశాలి బీసీల నాయకులకే వెయ్యాలన్నారు.ఓటు మనదే అధికారం కూడా మనదే కావాలి.మన పద్మశాలి,బీసీ నాయకులను గెలిపించుకునే బాధ్యత కూడా మనదే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ,పద్మశాలి సంఘం,బీసీ సంఘాల నాయకులు ఏ.రాజేశం, సిహెచ్.రామస్వామి,జే. నారాయణ,రాందాస్,అశోక్ వేముల,డి.లక్ష్మీనారాయణ, సత్యనారాయణ,బొద్దున బాపురావు,బాపు,పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
