నష్టపరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేత
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ శాంతినగర్ కాలనీ సమీపంలో ఉపరితల గని రెండో దఫా పనుల కొరకు డిసెంబర్ 3న ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న నేపథ్యంలో కాలనీవాసులకు ఇంటి స్థలాలు కేటాయించి ,ప్రస్తుతం ఉన్న ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అధికారికి కాలనీవాసులు వినతి పత్రం అందించారు. ఉపరితల గని మొదటి దఫా లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లకి కాలనీలలోని ఇండ్ల గోడలు పగిలిపోయాయని, దుమ్ముకు ప్రజలు అనారోగ్యాన బారిన పడ్డారని అందుచేతనే రెండోదఫా పనులు ప్రారంభానికి ముందే నష్టపరిహారం చెల్లించి తమ కాలనీవాసులను ఆదుకోవాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
