ఆయిల్ ఫామ్ పై మొగ్గు చూపాలిసోమలింగా రెడ్డీ.

ఆయిల్ ఫామ్ పై మొగ్గు చూపాలిసోమలింగా రెడ్డీ.

నిజాంపేట: నేటి ధాత్రి

 

రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై మోగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఎనుమల రాజబాబు 3 సంవత్సరాల వయస్సు గల ఆయిల్ ఫామ్ తోటను సందర్శించి.. రైతుకు పలు సూచనలు చేసి మాట్లాడారు.. మండల వ్యాప్తంగా ప్రజలు ఆయిల్ ఫామ్ తోటపై మోగ్గుచూపులున్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన వనరులు ఉన్నాయన్నారు. మొక్క నాటిన 4 సంవత్సరాల తర్వాత స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. సబ్సిడీ రూపంలో డ్రిప్ సౌకర్యంతో పాటు మొక్కలను అంతర్ పంట సాగు కొరకు డబ్బును పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీలత, మౌనిక తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version