గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజా ఆస్తుల సంరక్షణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రజా ఆస్తుల సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు భవనం పరిసరాల్లో శుభ్రత, రంగుల పనులు చేపట్టి గణతంత్ర దినోత్సవానికి గౌరవం అందించారు. ప్రజా ప్రదేశాలు శుభ్రంగా, అందంగా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇది గ్రామస్థులకు ప్రేరణగా నిలిచిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సివిక్ డ్యూటీ కార్యక్రమం ప్రజల్లో సామాజిక బాధ్యతపై అవగాహన పెంచింది. ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం బలంగా చాటిచెప్పింది.
