సర్పంచిగా ఆశీర్వదించండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
#ప్రజాసేవ కొరకై ఉద్యోగానికి రాజీనామా.
#నాగేల్లి జ్యోతి ప్రకాష్.
నల్లబెల్లి నేటి ధాత్రి:
నల్లబెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన నాగేల్లి జ్యోతి ప్రకాష్ బరిలో ఉండగా ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఏఎన్ఎం ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలని సంకల్పంతో సర్పంచిగా నామినేషన్ వేసి బరిలో ఉన్నానని అన్నారు. ఆశతో ఉన్నవారికి అధికారం వస్తే దోచుకుంటారు. ఆలోచనతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు. గ్రామ అభివృద్ధి ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవ కొరకు కృషి చేస్తానని. అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని కుల మత జాతి విభేదాలు లేకుండా అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆత్మ గౌరవంతో సమాజ సేవకు ముందుకు వచ్చాను గ్రామ ప్రజలందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో పేరుకుపోయిన అనేక సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజకీయంగా ఆర్థికంగా సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గ్రామస్తులను కోరుతూ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.
