మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
త్వరలో జరగబోయే నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో కషాయం జెండా ఎగవేసేందుకు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్
గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలలో 30 వార్డులలో అభ్యర్థులుగా నిలబడి విజయం సాధించడానికి కష్టపడాలని తెలిపారు.అలాగే బిఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పాలనను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
అవినీతి పరమైన బిఆర్ఎస్ పట్ల,
దౌర్జన్యపరమైన కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చూపిన 420 హామీల పట్ల ప్రజలు విసుకుచెందారని దీంతో ప్రజలందరూ కూడా బిజెపికి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.పోటీచేసే అభ్యర్థులు ప్రతీ బూత్ ను పటిష్టంగా చేసుకొని గడప గడపకు ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను తీసుకెళ్లాలని దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ , సీనియర్ నాయకులు కూనమళ్ళ పృథ్వి రాజ్ , జూలూరి మనీష్ గౌడ్ , శీలం సత్యనారాయణ, బాల్నే జగన్,
జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత,పట్టణ నాయకులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
