బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్…

బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూ సేకరణ-మల్హార్రావు మండలం- తాడిచెర్ల గ్రామములో జెన్కో వారు భూ సేకరణ చేయవల్సిన డెంజర్ జోన్ పరిధిలోనికి వచ్చు తాడిచెర్ల క్యాస్టివ్ కోలెమైన్-1 కొరకు భూసేకరణ చేయు పరిధిలో నున్న భూములు, నివాస గృహాలు ఇతర నిర్మాణాలను రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో తప్పిపోయిన మా ఇల్లును సర్వే చేసి బాధించిన న్యాయం చేయాలి
సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన మల్హార్రావు మండలం తాడిచర్ల గ్రామస్తులు ఇటీవల కాలంలో తాడిచెర్ల గ్రామంలో జెన్కో అండ్ సింగరేణి భూ సర్వే చేయడం జరిగింది దానితో తాడిచెర్లో గ్రామాన్ని తరలించడం జరుగుతుంది కానీ కొంతమంది గ్రామస్తుల పేర్లు రెవెన్యూ శాఖ అధికారులు సర్వే లిస్టులో పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు గత15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది అనంతరం స్పందించిన కలెక్టర్ తాడిచెర్ల గ్రామంలో రెవెన్యూ అధికారులు మళ్లీ భూ సర్వే చేసి గ్రామ సభ ద్వారా నిజమైన బాధితులను గుర్తించి అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. దీనితో బాధితులు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version