అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల పరిధిలోని మిర్జాపూర్ గ్రామంలో అనుమతులు లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న తెలుగు అంజన్న అనే వ్యక్తిపై హద్నూర్ ఎస్ఐ దోమ. సుజిత్ కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
