సొమ్మోకరిది సోకొకరిది

సొమ్మోకరిది సోకొకరిది
* ఎంఎల్ఏ మర్రి బీజేపీ నేతల ఫైర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 6 :

 

సొమ్మోకరిది సోకొకరిది అన్నట్లుగా వ్యవహారిస్తున్న మల్కాజిగిరి ఎంఎల్ఏ మర్రి తీరే వేరని మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ మల్లికార్జున గౌడ్ ధ్వజమెత్తారు. అల్వల్ సర్కిల్ బీజేపీ నేతలు మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఆర్ యు బి పనులు తానే చేసినట్లు ఎంఎల్ఏ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ కృషి వల్లనే జరుగుతున్నాయని అల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు వెల్లడించారు. దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో శ్రీకారం చుట్టామని, కానీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మొత్తం తానే చేసినట్టు ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవ చేశారు. ఒక రోజైనా ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి చర్చించినట్లు దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాణిక్య రెడ్డి, పరంకుశం మాధవ్, డివిజన్ ప్రెసిడెంట్ లు కార్తీక్ గౌడ్, అజయ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు దండుగుల వెంకటేష్, మురళి, వినయ్ శంకర్, గోపి, వర్మ, రవికిరణ్, మహేందర్ రెడ్డి, బన్సల్, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, సంజయ్, సుజాత, కరుణ శ్రీ ,పద్మిని, ముయ్యి సుజాత, అనురాధ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎంఎల్ఏ మర్రిని కలిసిన బిఆర్ఎస్ శ్రేణులు…

ఎంఎల్ఏ మర్రిని కలిసిన బిఆర్ఎస్ శ్రేణులు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 5 :

మల్కాజిగిరి అభివృద్ధి లక్ష్మని ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్బంగా ఆదివారం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ బిఆర్ఎస్ నేతలతో కలిసి ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్ రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజిగిరి అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీతా యాదవ్, బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, దేవయ్య గౌడ్, వీరేష్, సదానందం, జనార్దన్, అనిల్ కుమార్, రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version