సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన సర్పంచ్
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన సర్పంచ్ కుడ్ల మాలహల్ రావు సీఎం కప్ క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహద పడుతాయని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఎంతో గొప్పదని,గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని,వారి ప్రతిభను చాటేలా విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మండల,జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించి విద్యార్థులు మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కె.హనుమంత రావు,మండల పరిషత్ అధికారి మార్గవి రెడ్డి,సీఎం కప్ మండల ఇంచార్జి వెంకన్న,ఉప సర్పంచ్ టి.సంపత్,ఎస్.జి.యఫ్.ఐ సెక్రెటరీ ఆర్.సుభాష్, మండలంలోని వివిధ పాఠశాల నుండి వచ్చిన క్లస్టర్ ఇన్చార్జులు, పీ.డీలు,పీ.ఈ.టీలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
