అయినవోలులో వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి*
మెంతా తుఫాన్ భాదిత రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
ఒక ఎకరానికి 40 వేల నష్టపరిహారం అందించాలి
జి.ఎం.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు
నేటిధాత్రి ఐనవోలు :-
అయినవోలు మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ , ఐకెపి, ఏర్పాటు చేసి మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు , కేంద్రం ఏర్పాటు చేసి వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జీఎంపీస్ గొర్రెల మేకల పెంపక దారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
“రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చే సమయాన అకాల వర్షాలు, మెంతా తుఫాను వలన తీవ్ర నష్టం జరిగింది. వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు పెద్ద ఎత్తున నేలకూలిపోయాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం రైతులను ఆదుకోవడం అత్యవసరం,” అన్నారు.
ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికీ ₹500 బోనస్, పత్తికి ₹475 బోనస్ వెంటనే చెల్లించాలి.పంట నష్టపోయిన రైతులను గుర్తించి, వ్యవసాయ శాఖ ద్వారా సర్వే చేసి వరికి ఎకరాకు ₹40,000, పత్తికి ఎకరాకు ₹60,000 నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ”రైతును రాజు చేస్తున్నామని చెప్పడం సులభం, కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతును కాపాడడం నిజమైన ప్రభుత్వ ధర్మం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
