మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ను కలిసిన పలువురు నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి, మాజీ క్రికెట్ లెజెండ్ మహ్మద్ అజారుద్దీన్ను హుగ్గేల్లీ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆదివారం కలవడం జరి గింది. హుగ్గేల్లీలోని మహేంద్ర ప్యారడైస్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రిని ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా. సిద్దం ఉజ్వల్ రెడ్డితో కలిసి మంత్రి అజారుద్దీన్ ను కలిసిన హుగ్గేల్లీ కాంగ్రెస్ నాయకులు పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి అంశాలపై చర్చించారు. మంత్రి అజా రుద్దీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం తన శాఖ నిరంతరం కృషి చేస్తుం దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుగ్గేల్లీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పట్లోళ్ళ నర్సింహా రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమ్మరి రాజు, సీనియర్ నాయకులు నర్సింహులు, తుక్కా రెడ్డి, నరేష్, నాగిరెడ్డి తో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.
