ప్రపంచ పుడమి తల్లి దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ పుడమి తల్లి దినోత్సవ శుభాకాంక్షలు

భూమి పేదవాడికి ఆత్మగౌరవంతో సమానం

పరకాల,నేటిధాత్రి

భూమి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందిగా మనకు తెలుసు ఇలా ఏర్పడింది అనేదానికి ఖచ్చితమైన ఆధారాలు సామాన్యులుగా మనము చెప్పలేము ఈ భూమి అనేది ఈ విషయంలో ఒక గ్రహం సౌర కుటుంబంలో సూర్యుని నుండి మూడవ గ్రహంగా మనం చదువుకునే రోజుల్లో నుండి చెప్పుకుంటున్నాము, ఈ గ్రహంలోనే మానవుడికి సమస్త జీవరాసులు జీవనం కొనసాగించడానికి అనుకూలమైన గ్రహం కొండలు గుట్టలు నీరుతో కూడిన మహాసముద్రాలు ఉన్నటువంటి గ్రహం ఈ భూమిని రైతుల దున్ని పంట పండిస్తారు అలాగే ఇది వారసత్వపు ఆస్తి మరి ముఖ్యంగా పేదవాడికి వారసత్వంగా ఆస్తి ఉండవచ్చు(ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆస్తి)భూమిలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉండిపోయిన వ్యర్ధపదార్థాల ద్వారా భూమిలో ఖనిజాలను బొగ్గు బంగారం ఇనుము అనేక రకాలైన మానజీవనానికి ఉపయోగపడే కనిజాలు లభించడం భూమి యొక్క ప్రత్యేకత భూమి పైన వ్యర్ధాలు అనేకంగా పడవేస్తాము ప్లాస్టిక్ చెత్తాచెదరం పడవ ఇస్తాం భూమిపైన చెట్లు నాటడం ద్వారా ఆక్సిజన్ అలాగే చెట్ల ద్వారా వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది.గత కొద్ది 10,15 సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రంలో భూమి యొక్క విలువ అందనంత తారాస్థాయికి చేరుకుంటుంది.సామాన్యులు పేదవాడు తన ఆస్తిగా కొనుక్కోవడానికి వీలు లేనంతగా పెరిగిపోతుంది.భూమి యొక్క ధర పేదవాడు పేదవాడి గానే పడుతున్నాడు పేదవాడిగానే మరణిస్తున్నాడు మనిషి మరణించాక తన శివాని పూడ్చుకోవడానికి దహనం చేసుకోవడానికి కనీసం ఆరడుగుల భూమి లేకుండా పోయింది.ఈ రాష్ట్రంలో భూమి ప్రతి పేదవాడికి ఆస్తి హక్కు లాంటిది కదా! మరి ఎందుకు పేదవాడికి భూమి లేకుండాపోయింది.తరతరాలుగా భూమికి నోచుకోని జీవితాలు ఎన్ని ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇంకా పేదవాడిగా బ్రతుకుతున్నాడు.నిరుపేదలైనటువంటి వారిని గుర్తించి నివాస స్థలాలు పట్టా చేసి ఇవ్వాలి,వ్యవసాయ భూమి సాగు చేసుకోవడానికి ప్రభుత్వం అసైన్డ్ భూములు ఇవ్వాలి గత కొంతకాలంగా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివాస స్థలాలు వ్యవసాయ అసైన్డ్ భూములు ప్రభుత్వాలు మారుతున్నటువంటి కార్యక్రమం లో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉన్న భూమిని పరిశ్రమల పేరిట ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూమిని లాక్కుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము ప్రస్తుత కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో “భూమి ఎవరి చేతుల్లో ఉంది” అతి తక్కువ జనాభా ఉన్న వారి దగ్గర అధిక మొత్తంలో భూమి ఉన్నది అతి ఎక్కువ జనాభా ఉన్న వారి దగ్గర చాలా తక్కువ భూమి ఉన్నది మరి దేశానికి రాష్ట్రానికి కావాల్సిన టాక్సీలు కట్టడం తమ శ్రమను పెట్టి రాష్ట్రాలను దేశాన్ని కాపాడడం జరుగుతుంది కదా పేదవారు, వారికి ఎందుకు భూమి లేకుండా పోయింది.ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్కరు అయినా ప్రశ్నించిండ్రా,ఈ తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా డాక్టర్ విశారదన్ మహారాజు పేదవాడిని గుర్తించి పక్క ఇంటి నిర్మాణ స్థలాన్ని పట్టా చేసి ఇవ్వాలని వ్యవసాయ భూమి పట్టా చేసి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కడు అడుగుతున్న నిరుపేదల నాయకుడు ప్రతి పేదవాడికి భూమిని పంచాలి భూమిని కాపాడాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి భూమి ప్రతి ఒక్కరికి ఆస్తి హక్కుగా ఉండాలి లక్షల ఎకరాలు భూమి ఉన్న తెలంగాణలో భూమిని పంచరు భూమి పుత్రులు అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఆగస్టు 9న ఆదివాసుల దినోత్సవం జరుపుకుంటాం మరి ఈ దేశ భూమి పుత్రులుగా చెప్పుకుంటున్నప్పుడు కనీసం భూమి కూడా లేకపోవడం ఎంత అన్యాయం ఎంత దౌర్భాగ్యం ఈ తెలంగాణలో అతి తక్కువ జనాభా ఉన్న వారి దగ్గర రాజ్యం భూమి సంపద ఉంది మరి పేదలకు భూమి కావాలంటే రాజ్యం కోసం పోరాటం చేయలి అప్పుడు మాత్రమే ప్రతి పేదవాడికి భూమి పంచగలం మాట్లాడితే రైతు రాజు కావాలంటారు కనీసం కూడు గూడు,గుడ్డ లేనటువంటి ఆవాసానికి కూడా నోచుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నేటి తెలంగాణ లోని మనం చూస్తున్నాం ఇక రైతు ఎలా రాజు అవుతాడు రైతు స్వరాజ్య వేదిక తెలిపిన ఘనంకాల ప్రకారం 70లక్షల మంది పట్టాదారు రైతులు ఉంటే అందులో 25 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారు.అంటే ఇక్కడ ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని కవులు రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 80 శాతానికి పైగా కవులు రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాను తెలుస్తుంది.రాజ్యాంగ బద్దంగా రాజకీయాలకు కనుక చేస్తే భూమి లేనోడికి భూమి పంచండి ఈ భూమి (పుడమి) తల్లి దినోత్సవం సందర్భంగా మీరు భూమిని పంచగలరా!కానీ మీరు పంచలేరు ఎందుకంటే భూమి ఏ ఆత్మగౌరవం,భూమి సంపదను సృష్టిస్తుంది,సంపద రాజకీయాన్ని సృష్టించగలుగుతుంది,రాజకీయ ఎత్తుగడతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు అధికారానికి వస్తారందుకని భూమిని పంచరు ఎన్ని ఎకరాల భూమి ఉందని రైతుభరోసా విడుదల చేస్తారు.ఎవరి దగ్గర ఎక్కువ భూమి ఉంది రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నటువంటి కుట్రబూరిత రాజకీయాలు భూమి పుడమి తల్లి దినోత్సవం సందర్భంగా మీరు ప్రభుత్వాలు పేదవాడిని గుర్తించి భూమిని పంచండి.

ఇనుగాల దిలీప్ మహారాజ్ ధర్మసమాజ్ పార్టీ నాయకులు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version