ఉత్తమ ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు టి ఎస్ ఘన సన్మానం…

ఉత్తమ ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు టి ఎస్ ఘన సన్మానం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం ను పురస్కరించుకొని కాసిపేట్ మండలం నుండి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు జాడి ప్రవీణ్ ( రాష్ట్ర స్థాయి) టి జి ఎం ఎస్ కాశీపేట్,డి. పుష్పలత జడ్ పి ఎచ్ ఎస్ ముత్యం పల్లి,గంగిపల్లి రాజేశం జడ్.పి.హెచ్.ఎస్. ధర్మారావు పేట్ ను పి.ఆర్ టి.యు. కాశీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో మండల శాఖ అధ్యక్షులు గంప శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎంపిక చేయబడిన ముగ్గురు ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం కృషి చేయడమే కాకుండా, విధార్థులను శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించే విధంగా చేస్తూ ఇన్స్పైర్,సైన్స్ ప్రదర్శన లకు తీసుకువెళ్తూ, పాఠశాల కు విశేషం గా కృషి చేసినవారే కావడం వల్ల మండలం లోని ఉపాధ్యాయులు హార్షం వక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వీరికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమం లో ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఖలీల్,రాష్ట్ర బాధ్యులు నాగ మల్లేష్, మండల శాఖ అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version