తంగళ్ళపల్లిలో బిజెపి ఘాటు విమర్శలు

తంగళ్ళపల్లి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూపార్టీ నాయకులు మండలంలోని ప్రతి గ్రామం నుండి హాజరైనారు ఇట్టి సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగిపోయిందని .చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో స్పష్టంగా చెప్పాలని ఒక ఎమ్మెల్యే కు ఫండ్స్ రాలేని పరిస్థితి గ్రామాల ప్రజలు గమనించాలని గ్రామాల అభివృద్ధి పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే నిధుల పైన ఆధారపడి ఉందని బండి సంజయ్ ని .ప్రతినిధులు గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి ఖాయమని తెలిపారు. బిజెపి బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించే విధంగా బుజస్కందాలపైవేసుకొని గ్రామ గ్రామాన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిస్తూ. రెండు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకుమోక్షం లభించనుందని పేర్కొంటూ ఖజానాలో పైసలు లేవని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా సాధిస్తుందో ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలను రైతులను పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారని విమర్శిస్తూ సిరిసిల్ల ప్రజలు గెలిపించిన తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయారని .వ్యాఖ్యలు చేస్తూ. తంగళ్ళపల్లి మండలంలో 15 బోర్లుఎంపీ నిధులద్వారా ఏర్పాటు చేశారని కమ్యూనిటీ హాల్స్ కోసం సుమారు 30 లక్షల నిధులు మంజూరు చేశారని సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా అంబులెన్స్ ను కొనుగోలు చేసి ఆసుపత్రులకు అందజేశారు సుమారు 20వేల. సైకిలను విద్యార్థులకు అందించారు 10వ తరగతి విద్యార్థుల పరీక్షల రుసుములను చెల్లించేందుకు ముందుకు వచ్చారు ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని. పైసలు లేవని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా చేస్తుందో స్థానిక ఎమ్మెల్యే పల్లెల అభివృద్ధి ఎలా సాధిస్తారో ప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని గోపి సూచించారు గ్రామాల అభివృద్ధి కోసం బండి సంజయ్ ప్రతిపాదించిన పార్టీ అభ్యర్థులను పదవులను గెలిపించాలని ప్రజలకు పిలిపించారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీధర్ రావు. బీజేవైఎం అధ్యక్షుడు రాజిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల మండల ఇన్చార్జి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తుమ్మల శ్రీకాంత్. జిల్లా కోశాధికారి ఆసాని .రామలింగారెడ్డి. మీడియా కన్వీనర్ కాశి గంటి రాజు. సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్. జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. మండల ప్రధాన కార్యదర్శులు ఇటుకల రాజు. కోసి వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు. ఆశిర్వాద్. బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version