మినీ మేడారం జాతర విజయవంతంగా ముగిసింది

మినీ మేడారం జాతర విజయవంతంగా ముగిసింది

-జాతర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి

-జనంలో నుంచి వనంబాట పట్టిన అమ్మవార్లు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఈనెల 28 నుంచి ప్రారంభమైన మినీ మేడారం జాతర విజయవంతంతో శనివారం ముగిసింది. 1లక్ష 50 వేళ మంది భక్తులు మినీ మేడారం జాతరను సందర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా ఇరు గామాల జాతర ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో..మండల అధికారుల సహకారంతో..జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..అన్ని సౌకర్యాలను కల్పించడంతో..భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులను సమర్పించారని జాతర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమ్మవార్లు జనంలో నుంచి వనంబాట పట్టడంతో..జాతర ముగిసిందని ఆయన తెలిపారు. జాతర విజయవంతంలో భాగస్వాములైన మండల అధికారులకు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులకు, ఇరు గ్రామాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version