తక్కువ రేట్లకే భూములు ధారాదత్తం.. సర్కార్‌పై బీజేపీ నేతల ఫైర్
హిల్ట్‌కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని రామచందర్ రావు ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ ఈరోజు (సోమవాం) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతలు (BJP Leaders) కలిశారు. సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు (State BJP Chief Ramachandar Rao) మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇండస్ట్రియల్‌కు కేటాయించిన భూములను హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్‌గా మారుస్తూ కోట్ల రూపాయలు అవకతవకలకు తెర లేపుతున్నారని ఆరోపించారు. మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.
