ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు
ఇరాన్లో ఉన్న భారతీయులకు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
టెహ్రాన్, ఏప్రిల్ 8: ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఆగిన సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ది ట్రూత్’లో వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా, ‘ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరిస్తాం’ అని రాసుకొచ్చారు. అమెరికా సీజ్ ఫైర్ నిర్ణయానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపింది. లెబెనాన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది.
