విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్…

 విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్

 

యుద్ధ సమయంలో భారత యుద్ధ విమాన పైలట్లు ఇకపై ఆకాశంలో ఎంత ఎత్తుకెళ్లినా వారి ప్రాణాలకి ఢోకా లేదు. ఈ సాంకేతిక కోసం ఇప్పటి వరకూ విదేశాలపై ఆధారపడిన భారత్.. ఇక స్వయంగా తన పైలట్లను రక్షించుకోగలదు. దీనికి సంబంధించి చేసిన టెస్ట్ విజయవంతమైంది.

రక్షణ సాంకేతికతల్లో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్‌పై హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది.

ఇది.. భారత్‌ను ప్రపంచంలోని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ టెస్టింగ్’ ఎలైట్ క్లబ్‌లోకి తీసుకెళ్లిన ఘనత సాధించింది. ఈ క్లబ్‌లో ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఐదవ దేశంగా మారింది.ఈ విజయం భారత రక్షణ వ్యవస్థకు భద్రతనిస్తుంది. ఎమర్జెన్సీలో యుద్ధ విమానం నుంచి పైలట్‌ను సురక్షితంగా బయటకు పంపుతుంది. దీని ద్వారా భారత పైలట్లకు ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ హామీ లభిస్తుంది.కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, ‘భారత్‌కు డిఫెన్స్ కెపాబిలిటీలో ఇది మరో మైలురాయి. డిఫెన్స్ R&D విభాగం, DRDO, IAF, ADA, HALలను అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. DRDO చైర్మన్ సమీర్ వి. కామత్ కూడా టీమ్‌ను అభినందించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version