శ్రీ చైతన్య స్కూల్ లో గ్రాండ్ పేరెంట్స్ డే
మంచిర్యాల,నేటి ధాత్రి:
సామాజిక వారోత్సవాల కింద శనివారం శ్రీ చైతన్య పాఠశాల మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్లో గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా జరుపుకున్నారు.ఇందులో 50 మంది గ్రాండ్ పేరెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ఆటలలో పాల్గొని,నేటి సమాజంలో అమ్మమ్మ,తాతల ప్రాముఖ్యతని కొద్ది మంది గ్రాండ్ పేరెంట్స్ వారి మాటల్లో చెప్పుకుంటూ మురిసిపోయారు.విద్యార్థులందరూ కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని,పిల్లలు మెరుగైన జీవితం కోసం వారి గ్రాండ్ పేరెంట్స్ తో జీవితాన్ని గడపాలని ప్రిన్సిపాల్ అయూబ్ తన ప్రసంగంలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయూబ్,ఇంచార్జ్ అనగమత విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
