23 లక్షలతో అంబేద్కర్ భవనం నిర్మించి వదిలేశారు.
అంబేద్కర్ సంఘానికి అప్పగించాలని ఎమ్మెల్యేకి వినతి.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం మూడు సంవత్సరాల క్రితం 23 లక్షలతో నిర్మించి ప్రారంభించినప్పటికీ అంబేద్కర్ సంఘానికి ఆ భవనం అప్పగించడం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అంబేద్కర్ సంఘానికి అంబేద్కర్ అభిమానులకి అంబేద్కర్ వాదులకి మండల ప్రజలకి ఉపయోగంలో ఉండాల్సిన అంబేద్కర్ భవనం నిరుపయోగంగా ఉందని ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయిందని ఎమ్మెల్యే కి వివరించడం జరిగిందనీ తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులతో మాట్లాడారు అంబేద్కర్ భవనం మీకు అప్పగించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగంధర్, రాష్ట్ర నాయకులు పుల్లమల్లయ్య, దొడ్డికిష్టయ్య తదితరులు పాల్గొన్నారు
