*గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం దురదృష్టం..
*అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ,
అగ్నిమాపక అధికారులు , సిబ్బందికి అభినందనలు.
నగర పాలక సంస్థ మేయర్ డా శిరీష..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 03:
తిరుపతి గోవిందరాజల దేవాలయ ప్రాంతంలోని సన్నిది వీధిలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. ప్రమాదం చోటు చేసుకున్న సన్నిది ప్రాంతాన్ని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డా శిరీష సందర్శించారునగర పాలక సంస్థ విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖ అధికారి శ్రీనివాస రావుతో కలిసి అగ్ని ప్రమాదానికి గురైన షాపును మరియు సన్నిది వీధిలో ఉన్న ఇతర షాపులను సందర్శించి ఘటన కారణాలను అడిగి తెలుసుకున్నారు.షాపు నిర్వాహకులు అగ్నిప్రమాద శాఖ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వద్దు ఆలయ ప్రాంతంలో భక్తుల సందర్శన ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్న షాపులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సమగ్ర నివేదిక ఇవ్వాలని విపత్తు నివారణ అగ్ని మాపక శాఖకు ఆదేశం.
రాత్రి జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ
అగ్ని మాపక అధికారులను, సిబ్బందిని మేయర్ అభినందించారు.అదే సమయంలో గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాలలో ఉన్న షాపులలో నిబంధనలు పాటించే విధంగా చూడాలని మొత్తం నగర పరిధిలో వాస్తవ పరిస్థితితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తిరుపతి నగరం శ్రీవారి భక్తులు సందర్శించే ప్రాంతం కనుక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. షాపు నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం కల్పించాలని అదే సమయంలో నిబంధనలు పాటించే విషయంలో రాజీ ధోరణి ఉండకూడదన్నారు.అగ్ని ప్రమాదానికి గురి అయిన షాపుతో సహా మొత్తం పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని నగర పాలక సంస్థ విపత్తు నివారణ శాఖను ఆదేశించారు.