సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంక్రాంతి సెలవుల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి, నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ ఆదేశాలు విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జారీ చేయబడ్డాయి.
