ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగుల సమ్మె.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణం లోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నం భోజనం విరామం సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఆర్డిఓ జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్య క్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు ప్రమోద్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
