జహీరాబాద్‌లో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణం

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోదా రంగనాథుల చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఉదయం భోగి పళ్ళు కార్యక్రమం అనంతరం గోదా కళ్యాణం నిర్వహించగా, అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఈ వేడుకలో భక్తిశ్రద్దలతో గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version