హోటల్ గది ఖాళీ చేసే సమయంలో..

హోటల్ గది ఖాళీ చేసే సమయంలో.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

హోటల్ గదిని బుక్ చేసుకున్న దంపతులు.. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. భర్త హోటల్ గదిని ఖాళీ చేస్తున్న సమయంలో భార్యకు వింత ఆలోచన వచ్చింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో కక్కుర్తి కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో మాత్రం ఇది పీక్స్‌లో ఉంటుంది. ఎంతలా ఉంటుందంటే.. కంటికి కనిపించే ప్రతీదీ తనకే దక్కాలి.. అనేంతలా ఉంటుంది. ఇలాంటి కక్కుర్తితో కొందరు చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. మరికొందరు చేసే పనులు తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ హోటల్ గదిలో చేసిన నిర్వాకం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హోటల్ గదిలో ఇదేం పనమ్మా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోటల్ గదిని బుక్ చేసుకున్న దంపతులు.. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. భర్త హోటల్ గదిని ఖాళీ చేస్తున్న సమయంలో భార్య కన్ను.. లోపల ఉన్న వస్తువులపై పడింది. ఫ్రీగా ఏం దొరుకుతుందబ్బా.. అని గది మొత్తం తేరిపారా చూసింది.ఇంతలో ఆమెకు బాత్రూంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ కనిపించింది. దాన్ని ఎందుకు వదిలేయడం అనుకుని.. వెంటనే అక్కడికి వెళ్లి.. లోపల ఉన్న లిక్విడ్ బాటిల్‌ను బయటికి తీసింది. అందులోని లిక్విడ్‌ను (Woman Stole Hand Wash Liquid) వాటర్ బాటిల్‌లో నింపేసింది. తర్వాత ఖాళీ బాటిల్‌ను యథావిధిగా అక్కడే పెట్టేసి.. ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయింది. లిక్విడ్‌ను కూడా వదలని ఆమె కక్కుర్తి.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది.ఈ ఘటనను మొత్తం ఆమె భర్త వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె కక్కుర్తి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ఘనకార్యాలు మహిళలకే సాధ్యం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

 

ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అందరిలాగా బైక్ రైడ్ చేసి ఉంటే.. ఆశ్చర్యపోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆ మహిళ చేసిన నిర్వాకం.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ట్రాఫిక్‌లో బైకు ఆగగానే..దంపతుల్లో చాలా వరకూ నిత్యం గొడవపడేవారే కనిపిస్తుంటారు. భర్త దురలవాట్లకు బానిసై రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని భార్య ఫిర్యాదు చేస్తుంటుంది.. అలాగే చీటికీమాటికీ తనను అనుమానిస్తోందంటూ భర్త గగ్గోలు పెడుతుంటాడు. ఇలాంటి గొడవలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. ఈ క్రమంలో సర్దకుపోయే దంపతులను చూసినప్పుడు.. ఇలాంటి భార్య, భర్త అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది.. అని అనుకుంటుంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో దంపతులకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ తన భర్తతో పాటూ బైకుపై వెళ్తోంది. వెనుక కూర్చుని ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యను బైకుపై (Couple riding bike) ఎక్కించుకుని వెళ్తున్నారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అందరిలాగా బైక్ రైడ్ చేసి ఉంటే.. ఆశ్చర్యపోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆ మహిళ చేసిన నిర్వాకం.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ట్రాఫిక్‌లో బైకు ఆగగానే.. ఆ సమయంలోనూ ఆ మహిళ తన భర్తకు సేవలు చేసింది. బైకుపై ఉండగా సేవలు చేయడానికి ఏం ఉంటుందీ.. అని అనుకుంటే పొరపాటే.

ఖైనీ నములుతున్న భర్తకు ఆమె సాయం చేసిందన్నమాట. సాధారణంగా ఈ అలవాటు ఉన్న వారు.. ఖైనీని (Khaini) చేతిలో వేసుకుని నలపడం చూస్తుంటాం. అయితే ఇక్కడ భర్త బైకు నడుపుతూ బిజీగా ఉండడంతో ఆ బాధ్యతను ఆమె తీసుకుంది. భర్తకు ఎలాంటి శ్రమ లేకుండా.. ఖైనీని తానే చేతిలో వేసుకుని బాగా నలిపి, ఆ తర్వాత భర్త చేతికి అందించింది. దాన్ని అతను ఎంచక్కా నోట్లో వేసుకున్నాడు. ఇలా ట్రాఫిక్‌లో ఉన్న సమయంలో భర్తకు ఈమె సాయం చేసిందన్నమాట. ఈ ఘటనను మొత్తం వెనుకే కారులో వెళ్తున్న వారు చూసి అవాక్కయ్యారు.

వారు తమ ఫోన్‌లో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆ భర్త ఎంతో అదృష్టవంతుడు’.. అంటూ కొందరు, ‘ఈమె సేవలు మరువలేనివి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version