ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

 

ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అందరిలాగా బైక్ రైడ్ చేసి ఉంటే.. ఆశ్చర్యపోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆ మహిళ చేసిన నిర్వాకం.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ట్రాఫిక్‌లో బైకు ఆగగానే..దంపతుల్లో చాలా వరకూ నిత్యం గొడవపడేవారే కనిపిస్తుంటారు. భర్త దురలవాట్లకు బానిసై రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని భార్య ఫిర్యాదు చేస్తుంటుంది.. అలాగే చీటికీమాటికీ తనను అనుమానిస్తోందంటూ భర్త గగ్గోలు పెడుతుంటాడు. ఇలాంటి గొడవలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. ఈ క్రమంలో సర్దకుపోయే దంపతులను చూసినప్పుడు.. ఇలాంటి భార్య, భర్త అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది.. అని అనుకుంటుంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో దంపతులకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ తన భర్తతో పాటూ బైకుపై వెళ్తోంది. వెనుక కూర్చుని ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యను బైకుపై (Couple riding bike) ఎక్కించుకుని వెళ్తున్నారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అందరిలాగా బైక్ రైడ్ చేసి ఉంటే.. ఆశ్చర్యపోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆ మహిళ చేసిన నిర్వాకం.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ట్రాఫిక్‌లో బైకు ఆగగానే.. ఆ సమయంలోనూ ఆ మహిళ తన భర్తకు సేవలు చేసింది. బైకుపై ఉండగా సేవలు చేయడానికి ఏం ఉంటుందీ.. అని అనుకుంటే పొరపాటే.

ఖైనీ నములుతున్న భర్తకు ఆమె సాయం చేసిందన్నమాట. సాధారణంగా ఈ అలవాటు ఉన్న వారు.. ఖైనీని (Khaini) చేతిలో వేసుకుని నలపడం చూస్తుంటాం. అయితే ఇక్కడ భర్త బైకు నడుపుతూ బిజీగా ఉండడంతో ఆ బాధ్యతను ఆమె తీసుకుంది. భర్తకు ఎలాంటి శ్రమ లేకుండా.. ఖైనీని తానే చేతిలో వేసుకుని బాగా నలిపి, ఆ తర్వాత భర్త చేతికి అందించింది. దాన్ని అతను ఎంచక్కా నోట్లో వేసుకున్నాడు. ఇలా ట్రాఫిక్‌లో ఉన్న సమయంలో భర్తకు ఈమె సాయం చేసిందన్నమాట. ఈ ఘటనను మొత్తం వెనుకే కారులో వెళ్తున్న వారు చూసి అవాక్కయ్యారు.

వారు తమ ఫోన్‌లో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆ భర్త ఎంతో అదృష్టవంతుడు’.. అంటూ కొందరు, ‘ఈమె సేవలు మరువలేనివి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version