అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జిల్లా పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం రేగొండ, గణపురం, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాలల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే పాల్గొని లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం ఆయా మండలాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించినోళ్లు ఒక్క రేషన్ కార్డూ ఇవ్వకపోగా, పేదలను నిరుపేదలుగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. పేదలకు కూడా సన్నబియ్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కాని, ఒక్క కిలో సన్న బియ్యం కాని ఇవ్వలేదన్నారు. అనంతరం కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు