గంజాయి సమాచారం ఇవ్వండి – ₹5,000 వరకు బహుమతి పొందండి…

గంజాయి సమాచారం ఇవ్వండి – ₹5,000 వరకు బహుమతి పొందండి

సమాచారం ఇవ్వాల్సిన మొబైల్ నెంబర్ [8712656999]

ఎస్పీ డా. శబరీష్, ఐ.పి.ఎస్.

మహబూబాబాద్/ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ యువత ఆరోగ్యం, భద్రత మరియు భవిష్యత్తును కాపాడటానికి గంజాయి వినియోగం మరియు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉంది. డ్రగ్స్ దుర్వినియోగం ఒక తీవ్రమైన సామాజిక సమస్య. ఇది నిశ్శబ్దంగా యువత జీవితాలను నాశనం చేస్తూ కుటుంబాలను బలహీనపరుస్తుంది మరియు వ్యక్తులను నేరాల వైపు నడిపిస్తుంది. జిల్లా ప్రజలకు సురక్షితమైన, డ్రగ్స్ రహిత వాతావరణాన్ని కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

గంజాయి లాంటి మహమ్మారి నుండి మన ఉరిని, యువత భవిష్యత్తుని కాపాడేందుకు గంజాయి వినియోగం లాంటి కార్యకలాపాలను గుర్తించి పూర్తిగా అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని. బాధ్యత గల పౌరులు, యువజన నాయకులు, గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు సమాజాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించ గలరని. అందువల్ల మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రజలందరినీ గంజాయి వినియోగదారులు లేదా సరఫరా చేసే వ్యక్తుల గురించి విశ్వసనీయ సమాచారం అందించాలని కోరుతోంది. పోలీసులకు చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడే సమాచారాన్ని అందించిన వారికి ₹5,000 వరకు బహుమతి ఇవ్వబడుతుందని. సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.

ప్రజలు తమ సమాచారం ఈ ప్రత్యేక మొబైల్ నంబర్ ద్వారా అందించవచ్చు: [8712656999].

మీ చిన్న సమాచారం ఒక పెద్ద మార్పును తీసుకురాగలదని. మన యువతను కలిసి మహబూబాబాద్ జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా కాపాడుకుందాం మార్చుకుందాం అని జిల్లా ఎస్పీ తెలిపారు.

వనపర్తి లో ఈనెల 20న శ్రీ పాండురంగ విటలీశ్వర స్వామి దేవాలయంలో ధ్వజ సంభ ప్రతిష్ట..

వనపర్తి లో ఈనెల 20న శ్రీ పాండురంగ విటలీశ్వర స్వామి దేవాలయంలో ధ్వజ సంభ ప్రతిష్ట

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడలో ఈనెల 20న శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయం లో ధ్వజస్తంభ ప్రతిష్ట ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పాపిశెట్టి శ్రీనివాసులు వలకొండ శ్రీనివాస్ పూరి పాండు పూరి బాలరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు 18న ఉదయం 10 గంటలకు ధ్వజస్తంభం ఊరేగింపు సాయంత్రం అభిషేకం ప్రత్యేక పూజలు 19న ఉదయం 8 గంటలకు వాస్తు పూజ హోమాలు మంగళహారతి సాయంత్రం సాయంత్రం విష్ణు సహస్రనామార్చన భజనలు ప్రత్యేక పూజలు 20 న ఉదయం హోమాది 8 . 45 నిమిషాలకు ధ్వజస్తంభ ప్రతిష్ట ఉంటుందని by అనంతరం పూర్ణాహుతి ప్రత్యేక పూజలు ఉంటాయని వారు పేర్కొన్నారు వనపర్తి లో బ్రాహ్మణవాడలో దాదాపు 350 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ రుక్మాబాయి సమేత విఠలేశ్వర స్వామి దేవాలయం లో ప్రతి సంవత్సరం ధనుర్మాసం సందర్భంగా ఉదయం సాయంత్రం ధనుర్మాస ఉత్సవాలు అనంతరం కళ్యాణం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు శ్రీ పాండురంగ వి టలీశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట ప్రత్యేక పూజలకు వనపర్తి టౌన్ పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version