వనపర్తి లో ఈనెల 20న శ్రీ పాండురంగ విటలీశ్వర స్వామి దేవాలయంలో ధ్వజ సంభ ప్రతిష్ట..

వనపర్తి లో ఈనెల 20న శ్రీ పాండురంగ విటలీశ్వర స్వామి దేవాలయంలో ధ్వజ సంభ ప్రతిష్ట

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడలో ఈనెల 20న శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయం లో ధ్వజస్తంభ ప్రతిష్ట ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పాపిశెట్టి శ్రీనివాసులు వలకొండ శ్రీనివాస్ పూరి పాండు పూరి బాలరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు 18న ఉదయం 10 గంటలకు ధ్వజస్తంభం ఊరేగింపు సాయంత్రం అభిషేకం ప్రత్యేక పూజలు 19న ఉదయం 8 గంటలకు వాస్తు పూజ హోమాలు మంగళహారతి సాయంత్రం సాయంత్రం విష్ణు సహస్రనామార్చన భజనలు ప్రత్యేక పూజలు 20 న ఉదయం హోమాది 8 . 45 నిమిషాలకు ధ్వజస్తంభ ప్రతిష్ట ఉంటుందని by అనంతరం పూర్ణాహుతి ప్రత్యేక పూజలు ఉంటాయని వారు పేర్కొన్నారు వనపర్తి లో బ్రాహ్మణవాడలో దాదాపు 350 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ రుక్మాబాయి సమేత విఠలేశ్వర స్వామి దేవాలయం లో ప్రతి సంవత్సరం ధనుర్మాసం సందర్భంగా ఉదయం సాయంత్రం ధనుర్మాస ఉత్సవాలు అనంతరం కళ్యాణం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు శ్రీ పాండురంగ వి టలీశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట ప్రత్యేక పూజలకు వనపర్తి టౌన్ పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version