ముస్లింలకు రంజాన్ తోఫా బట్టల పంపిణీ
24వ వార్డు సిపిఐ కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు సిపిఐ కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో
రంజాన్
తోఫా ( లాల్చి క్లాత్, చుడీదార్ క్లాత్, పట్టు చీర, బట్టలను
ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందులు, మజీద్ రిపేర్ల కొరకు నిధులు, ఈద్గా కబ్రిస్తాన్లకు నిధులు, ఇమామ్ మోజల్లకు గౌరవ వేతనాలు, అనేకమైన కార్యక్రమాలు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా 24వ వార్డు సిపిఐ కౌన్సిలర్ వేముల జ్యోతి-శ్రీకాంత్ కొనియాడారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్, 24 వ వార్డు అధ్యక్షులు కేవీ అశోక్ గౌడ్, మైనార్టీ నాయకులు మజీద్ కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు
