ఎస్ఎస్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లాకు 23వ ర్యాంక్

ఎస్ఎస్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లాకు 23వ ర్యాంక్

జిల్లాలో 95.25 శాతం ఉత్తీర్ణత-95.79 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పైచేయి

పరీక్షలలో 9,485 మంది హాజరు, 9,034 మంది ఉత్తీర్ణత

జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు

నేటిధాత్రి ప్రతినిధి,వరంగల్:

 

మార్చి/ఏప్రిల్ – 2026 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో వరంగల్ జిల్లా రాష్ట్రంలో 23వ ర్యాంక్ సాధించిందని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం మొత్తం ఉత్తీర్ణత శాతం 95.25 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 95.79శాతంతో పైచేయి సాధించారు.జిల్లాలో మొత్తం 9,485 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 4,924 మంది బాలురు, 4,561 మంది బాలికలు ఉన్నారని వివరించారు. వీరిలో 9,034 మంది ఉత్తీర్ణత సాధించారని, బాలురు 4,665 మంది, బాలికలు 4,369 మంది పాసయ్యారని పేర్కొన్నారు.జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 95.25 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 95.79శాతం, బాలుర ఉత్తీర్ణత 94.74 శాతంగా నమోదైందని డీఈఓ రంగయ్య నాయుడు వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version