రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదు ఇది మా హక్కు…

రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదు ఇది మా హక్కు

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పైడిపల్లి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదు ఇది మా హక్కు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ , రాజకీయ రంగాల్లో కల్పించాలని ఒకరోజు దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో మెజారిటీ అయిన బీసీలు ప్రతి రంగంలోనూ వెనుకబడినారు. రాజకీయ, ఆర్థిక, విద్యా ,ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కడ కూడా వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం లేదు. రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు ,అందువల్ల చట్టసభలలో వారి ఉనికి నామ మాత్రమే. ఉద్యోగాలు విద్యా రంగాల్లో కూడా రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదు. బీసీలకు రిజర్వేషన్ సాధించాలంటే అన్ని రాజకీయ పార్టీలు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యంగా పోరాడవలసిన ఆవశ్యకత ఏర్పడిందని రానున్న రోజుల్లో బీసీ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తూ రిజర్వేషన్లు సాధించేంతవరకు ముక్క వోని దీక్షతో అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీల కోసం ఎవరు మద్దతిచ్చిన వారి మద్దతు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ పరిస్థితుల్లో బీసీ సమాజం మా వాటా మాకు కావాలి – మా అధికారం మాకు కావాలి అనే నినాదంతో మేల్కొని తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినవి.42శాతం రిజర్వేషన్ ను భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలననీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుతానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ తో పాటు బీసీ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటి కో కన్వీనర్లు బర్ల గట్టయ్య పటేల్,గుమ్మడి ప్రదీప్ పటేల్, అమృత అశోక్ కురుమ, ఆర్డినేటర్ శేఖర్ నాని, బీసీ జేఏసీ మహిళా చైర్మెన్ మేకల రజిత, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు తాటికంటి రవి కుమార్, బీసీ అజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ జేఏసీ మహిళ నాయకులు పుట్టపాక పుష్ప, ఓరుగంటి లక్ష్మి, చింతల లత, బీసీ హక్కుల సాధన సమితి అధ్యక్షులు బీమానాథుని సత్యనారాయణ, కురుమ సంఘం జిల్లా కన్వీనర్ కోరే సుధాకర్, గౌడ సంఘం జిల్లా నాయకులు తాటి అశోక్ గౌడ్, ముంజల రవీందర్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు నారగోని ఎల్లస్వామి, ఎంజల రమేష్, బాలాగోని రమేష్, కంచు రాజేందర్, మాధవాచారి,
బీసీ దీక్షకు మద్దతుగా బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా కో ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్, బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు కౌటం రవి పటేల్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి ముద్దమల్ల భార్గవ్ ,బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగల రాజేందర్,బీజేపీ పట్టణ అధ్యక్షులు గీసా సంపత్ తెలిపారు
జేఏసీ యూత్ నాయకులు పూర్ణ యాదవ్, రేగళ్ల వంశీ, కాల్లోజు దిలీప్, గుజ్జెటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ 24న చలో ఇందిరా పార్క్…

అక్టోబర్ 24న చలో ఇందిరా పార్క్

గోడపత్రికను ఆవిష్కరించిన కొత్తూరు రవీందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 42% రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ అక్టోబర్ 24 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మహా ధర్నా చేయడం జరుగుతుంది.
విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్లు తక్షణమే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం దీనికై కేంద్రంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలి,
అత్యంత వెనుకబడిన బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో ఉప వర్గీకరణ చేసి రిజర్వేషన్లు కల్పించాలి,
ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.కావున వాటిని రద్దు చేయాలి లేదా బీసీ ఎస్సీ ఎస్టీలలోని నిరుపేద వర్గాలకు ఇందులో అవకాశం కల్పించాలి,
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి,
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన బడ్జెట్ ను తక్షణమే విడుదల చేయాలి. సబ్ ప్లాన్ అమలు చేయాలి
రెండు లక్షల ఉద్యోగాలభర్తిని వెంటనే ప్రారంభించాలి. ప్రవేశ పరీక్షలకు సంబంధించి జీవో 29 రద్దుచేసి, పాత జీవో 55 పునరుద్ధరించాలి
బీసీలకు ఎస్సీ, ఎస్టీల వలె రక్షణ చట్టాలు కల్పించాలి
జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 56% రిజర్వేషన్లు అమలు చేయాలి మేమేంటో మాకు అంత వాటా అమలుపరచాలి
రాజ్యాంగ సవరణ చేసి న్యాయస్థానాలు సృష్టించిన 50 శాతం సీలింగ్ ను ఎత్తివేయాలి
ఉద్యోగాల ప్రమోషన్లలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి
హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించాలి
నామినేటెడ్ కార్పొరేషన్ పదవులలో సామాజిక న్యాయం పాటించి బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నియమించాలి.
పై డిమాండ్స్ ను నెరవేర్చుటకై ఈనెల 24న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో భూపాలపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయగలరు.
ఈ కార్యక్రమంలో బొజ్జపల్లి మహర్షి,రేణుకుంట్ల బీసీ జాక్ కోఆర్డినేటర్ శేఖర్ నాని గట్టు రవి దేవేందర్ మహేష్, మల్లయ్య,మంత్రి రాకేష్,బోయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version