అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుకు పుల్ల ప్రతాప్ ఎంపిక

జాతీయ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుకు
పుల్ల ప్రతాప్ ఎంపిక.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల రాజేశ్వరి సాంబయ్య గార్ల కుమారుడు పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డ్ కు ఎంపికైనట్లు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఆశయాల కొరకు కృషి చేస్తూ , కళారంగాల్లో గాయకుడిగా రచయితగా సమాజంలో జరుగుతున్న అనేక విషయాలపై ప్రత్యేక కృషి చేస్తు విశిష్ట సేవలు అందిస్తున్న పుల్ల ప్రతాప్ సేవలను గుర్తించి కాకతీయ దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు ఎంపిక చేయడం జరిగిందనీ అన్నారు. ఢిల్లీలో పంచశీల ఆశ్రమంలో జరగబోయే 41 వ జాతీయ అంతర్జాతీయ సదస్సులో డిసెంబర్ 12న జాతీయ అంతర్జాతీయ ప్రముఖులచే ఈ అవార్డును అందిస్తున్నట్లు డాక్టర్ జితేందర్ మను తెలిపారు. పుల్ల ప్రతాప్ మాట్లాడుతూ నేను చేస్తున్న నా సేవలను గుర్తించి అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఆధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను కు అలాగే నాకు సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు దొడ్డి కిష్టయ్య, దబ్బెట రమేష్ జిల్లా అధ్యక్షులు పుల్ల ప్రేమ్ సాగర్ మండల అధ్యక్షులు అధ్యక్షులు జన్నే యుగేందర్ మాజీ అధ్యక్షులు బొడ్డు ప్రభాకర్ సరిగొమ్ముల రాజేందర్ మండల నాయకులు గుర్రపు రాజమౌళి గురుకుంట్ల కిరణ్ గుర్రపు రాజేందర్, కట్కూరి శ్రీనివాస్, కట్కూరి రమేష్ గుర్రపు తిరుపతి ల కు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version